ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో( TDP ) అసమ్మతి సెగ కొనసాగుతోంది.సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే( MLA Ramaraju ) సీటును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.
గత రెండు రోజులుగా పార్టీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఉండి కూటమి అభ్యర్థిని మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్టీకి మండలస్థాయి నేతలు రాజీనామా లేఖలు పంపారని తెలుస్తోంది.దీంతో ఉండిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.