ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు( Director Singeetham Srinivasa Rao )అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు.వైవిధ్యభరిత చిత్రాలకు ఆయన పెట్టింది పేరు.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేమైన స్థానాని సంపాదించుకున్నారు సంగీతం శ్రీనివాసరావు.ఆయన తన కెరీర్ లో ఎన్నో విజయాలను చూశారు.
అలానే ఆ విజయానికి తగ్గ పురస్కారాలు కూడా అందుకున్నారు.అలాంటి సింగీతం కెరీర్ లో టాప్ 10 క్లాసిక్ సినిమాలేంటో( Classic Movies ) ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• పంతులమ్మ:-
నాలుగు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం సొంతం చేసుకున్న మ్యూజికల్ హిట్ సినిమా 1978 లో విడుదల అయింది.రంగనాథ్, లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమాలో ‘సిరిమల్లె నీవే విరిజల్లు కావే’ అనే పాట బాగా పాపులర్ అయింది.
•సొమ్మొకడిది సోకొకడిది:
కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా నటించిన ఈ సినిమా లో జయసుధ, రోజా రమణి హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా 1979లో విడుదల అయ్యి సందడి చేసింది. ‘అబ్బో నేరేడు పళ్ళు ‘ అనే పాట ఈ సినిమాలోదే.ఇందులో కమల్ ద్విపాత్రాభినయం చేశారు.
• మయూరి:
ఏకంగా 14 నంది పురస్కారాలను అందుకున్న ఈ సినిమా డ్యాన్సర్ సుధా చంద్రన్ నిజజీవితం( Sudha Chandran Real Life Story ) ఆధారంగా తెరకెక్కించారు.ఈ బయోపిక్ సినిమాలో సుధా చంద్రన్ తన పాత్రను తనే స్వయంగా పోషించడం విశేషం.1985లో రిలీజైన ఈ సంచలన చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఇటు నంది, అటు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు సింగీతం శ్రీనివాసరావు.
• పుష్పక విమానం:-
కమల్ హాసన్, అమల జంటగా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా 1987 పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషలో విడుదల అయింది.ఒక జాతీయ పురస్కారం, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకుంది.
• విచిత్ర సోదరులు:-
కమల్ హాసన్ మూడు పాత్రలలో నటించిన ఈ సినిమా 1989 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా లో మరగుజ్జు పాత్రని తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. ‘అపూర్వ సగోదరగళ్’అనే పేరుతో తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ‘విచిత్ర సోదరులు'( Vichitra Sodarulu ) పేరుతో చిత్రీకరించబడింది.ఈ సినిమా ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్, రెండు తమిళనాడు స్టేట్ అవార్డులను సొంతం చేసుకుందీ.
• మైఖేల్ మదన కామ రాజు:
ఈ సినిమాలో కమల్ హాసన్ నాలుగు విభిన్న పాత్రల్లో అద్భుతంగా ఎంటర్టైన్ చేసారు.సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా రికార్డు సాధించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.సింగీతం శ్రీనివాస్ రావు మార్క్ వినోదంతో ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా 1990లో రిలీజైంది.
• ఆదిత్య 369:-
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) నటించారు.మూడు విభిన్న కాలాల్లో సాగే ఈ చిత్రంలో కృష్ణకుమార్ గా, శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.ఇక 1991లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.
• బృందావనం:-
రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా 1992 లో రిలీజ్ అయింది .ఈ సినిమాకి గానూ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు సింగీతం శ్రీనివాస్ రావు.
• మేడమ్:-
రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో ఎంటర్టైన్ చేసిన ‘మేడమ్ ‘( Madam ) సినిమా 1994 లో విడుదల అయింది.సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రెండు విభాగాల్లో నంది పురస్కారాలను అందుకుంది.
• భైరవ ద్వీపం:-
తొమ్మిది నంది పురస్కారాలతో సంచలనం సృష్టించిన జానపద చిత్రమే భైరవద్వీపం( Bhairava Dweepam ). ఈ సినిమా లో బాలకృష్ణ, రోజా జంటగా నటించారు.అప్పట్లో ఈ సినిమా విశేషాదరణ పొందింది.
ఈ సినిమా 1994 లో విడుదల అయ్యి విజయం సాధించింది.