తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నాడు.తమిళంలో 96 చిత్రంలో నటించిన విజయ్ సేతుపతి పాత్రను తెలుగులో శర్వానంద్ పోషించబోతున్నాడు.ఇక త్రిష పోషించిన పాత్రను సమంత పోషించబోతుంది.96 చిత్రంలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు.హీరో హీరోయిన్ మద్య లవ్ కాని, కామెడీ కాని ఉండవు.కేవలం ఎమోషన్స్ మాత్రమే చూపించారు.అద్బుతమైన ఎమోషన్స్ తో చిత్రాన్ని తెరకెక్కించారు.
అలాంటి ఎమోషన్ సినిమాలు మన తెలుగులో ఆడటం కష్టమే.తెలుగులో ఏమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలకే ప్రాముఖ్యత.అందుకే ఎమోషనల్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చే పనిలో దిల్ రాజు ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఎమోషనల్ ఫీల్ పోకుండా ఉండేందుకు తమిళంలో తెరకెక్కించిన రామ్ కుమార్‌ను తెలుగులో కూడా దర్శకత్వం చేయిస్తున్నాడు.తెలుగులో అద్బుతమైన కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలంటూ దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.
96 వంటి ఫీల్ ఉన్న సినిమాలను కమర్షియల్ టచ్‌లో చూపిస్తే మొదటికే మోసం వస్తుందనే విషయంను దిల్‌రాజు పట్టించుకోవడం లేదు.అనవసరంగా ప్రయత్నాలు చేస్తూ మొత్తానికి కంపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఉన్నది ఉన్నట్లుగా సినిమాను తీస్తే కలెక్షన్స్ రాకున్నా కూడా ఒక మంచి సినిమా వచ్చిందని ప్రేక్షకులు అంటారు.కొంతమంది అయినా ఆ సినిమాను ఆధరిస్తారు.కాని కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ 96 ని తీస్తే మొత్తమే మునిగి పోయే అవకాశం ఉంది.