తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేర్లలో నందమూరి బాలకృష్ణ పేరు ఒకటి.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ సినిమా టైటిల్ విషయంలో మనం కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా సినిమాల వరకు సింహ అనే సెంటిమెంటుతో ఆయన టైటిల్స్ ఉంటాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ వంటి సినిమాలన్నీ కూడా సింహ పేరుతో వచ్చాయి.
అయితే బాలకృష్ణకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే అమితమైన భక్తి.అందుకే ఎప్పుడు విశాఖ వచ్చినా ఆయన స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్తారు.
ఇలా నరసింహస్వామిని ఎంతో భక్తిగా భావించి సెంటిమెంట్ గా కొలిచే బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ సమయంలో సింహాద్రి అప్పన్న సన్నిదైన ప్రహ్లాదపురం వద్దే ఓ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఈ టైటిల్ చెప్పారట.
ఇక ఈ సినిమా విడుదల అయ్యే బ్లాక్ బస్టర్ కావడంతో బాలకృష్ణకు ఆ స్థలం సెంటిమెంటుగా మారిపోయింది.

ఈ సినిమా సమయం నుంచి బాలకృష్ణకు సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఎంతో సెంటిమెంట్ గా మారిపోయిందని, సమరం సింహారెడ్డి సినిమా ముహూర్త సన్నివేశాన్ని కూడా ఈ ఆలయంలోని నిర్ణయించారని తెలుస్తుంది.ఈ విధంగా బాలకృష్ణకు నరసింహస్వామి అంటే భక్తి మాత్రమే కాకుండా సెంటిమెంట్ కూడా ఉందని ఆయన పేరును తన సినిమాలో పెట్టుకుంటే సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అవుతుందని బాలకృష్ణ ఎంతగానో నమ్మారు.