పెళ్లికి ముందే ఆ హీరోయిన్ తో ప్రేమలో చైతు.. నిజమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నాగచైతన్య మరొక నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే సమంత నాగచైతన్య పలు కారణాలవల్ల విడిపోవడంతో వీరి విడాకుల గురించి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురైనప్పటికీ సరైన సమాధానం మాత్రం తెలియడం లేదు.

 Chaitu Was In Love With That Heroine Before Marriage Is It True Chaitu, Sobhita-TeluguStop.com

ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయి ప్రస్తుతం ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే సమంత నుంచి విడిపోయిన అనంతరం నాగచైతన్య మరోసారి ప్రేమలో పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి.

నాగచైతన్య మరొక నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై పరోక్షంగా వీరిద్దరూ స్పందించి అలాంటిదేమీ లేదన్నట్టు క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే విడాకుల తర్వాత మాత్రమే కాకుండా నాగచైతన్య సమంతతో పెళ్లికి ముందే మరొక హీరోయిన్ తో కూడా పీకల్లోకి ప్రేమలో మునిగిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఆ హీరోయిన్ తో బ్రేకప్ కావటం వల్లే సమంతను నాగచైతన్య పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినపడుతున్నాయి.

Telugu Chaitu, Premam, Samantha, Shruti Haasan, Tollywood-Movie

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన నటి శృతిహాసన్ నాగచైతన్య ప్రేమలో పడిందని నాగచైతన్య కూడా తనని పీకల్లోకి ప్రేమించారని వార్తలు వచ్చాయి.అయితే కొన్ని కారణాలవల్ల నాగచైతన్య శృతిహాసన్ బ్రేకప్ కావడంతో సమంత దగ్గర అయిందని ఇలా శృతిహాసన్ తో బ్రేకప్ అవ్వటం వల్లే సమంత నాగచైతన్య పెళ్లి జరిగిందని వార్తలు వస్తున్నాయి.సమంత కూడా నాగచైతన్య కన్నా ముందు హీరో సిద్ధార్థ తో కలిసి ప్రేమయాణం కొనసాగించిన విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి బ్రేకప్ అనంతరం సమంత నాగచైతన్యకు దగ్గర అయ్యి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube