రాబోయే సార్వత్రిక ఎన్నికల పై టీడీపీ అధినేత చంద్రబాబు చాలా అంచనాలే పెట్టుకున్నారు.ఇక వైసిపి కూడా రాబోయే ఎన్నికలపై చాలా ధీమాతో ఉంది .175 స్థానాలకు గాను 175 స్థానాలను గెలుచుకోవాలనే టార్గెట్ ను విధించుకుంది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత , ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు అలెర్ట్ అవుతున్నారు ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తూ బలమైన అభ్యర్థులను పోటీకి దించేందుకు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు.
బలమైన అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనతో ఉన్న జగన్ ముందుగానే అభ్యర్థులను నియోజకవర్గాల వారీగా ప్రకటిస్తూ వస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే టిడిపి అధినేత చంద్రబాబు కూడా కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు.
దీనిలో భాగంగానే గన్నవరం టిడిపి అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నారు.తరచుగా చంద్రబాబు, లోకేష్ తో పాటు టిడిపి కీలక నాయకుల పైన వంశీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, వ్యక్తిగత విమర్శలతోనూ విరుచుకుపడుతూ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా 2024 ఎన్నికల్లో వంశీని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.దీనిలో భాగంగానే ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి దించి వంశీని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు.
దీనిలో భాగంగానే గన్నవరం టిడిపి అభ్యర్థి ఎంపిక విషయంలో ఫైనల్ నిర్ణయానికి వచ్చారట.ఇప్పటికే గన్నవరం టిడిపి ఇన్చార్జిగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి బాధ్యతలు అప్పగించారు.ఆయన గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం మృతి చెందడంతో, అక్కడ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ను సమన్వయకర్తగా కొత్త టీం ను చంద్రబాబు ప్రకటించారు.ఈ సందర్భంగా 2024 లో టిడిపి అభ్యర్థిగా ప్రస్తుత తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవినేని చంద్రశేఖర్ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
దేవినేని చంద్రశేఖర్ లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దేవినేని చంద్రశేఖర్ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం.