రామ్ చరణ్ తో సినిమా తీసి కూడా ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ కొట్టని డైరెక్టర్...

సాధారణం గా ఒకసారి పెద్ద హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు ఆ ఒక్క సినిమా తీసి స్టార్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ చాలామందే ఉన్నారు కానీ కెరియర్ మొదట్లోనే తీసిన రెండో సినిమానే మెగా పవర్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన కూడా ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందని డైరెక్టర్ ఎవరంటే ఆయనే సంపత్ నంది గారు.

 Even After Making A Movie With Ram Charan, The Director Has Not Scored A Single-TeluguStop.com

ఈయన తీసిన మొదటి సినిమా ఏమైంది ఈవేళ సూపర్ సక్సెస్ అయింది దాంతో రెండో సినిమానే రామ్ చరణ్ తో తీసి ఓకే పర్లేదు అనే పేరు సంపాదించు కున్నప్పటికి ఆ తర్వాత రవితేజ తో తీసిన బెంగాల్ టైగర్,గోపిచంద్ తో తీసిన గౌతమ్ నంద సినిమాలు యావరేజ్ గా ఆడడంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు అయనకన్న వెనకాల డైరెక్టర్స్ అయిన కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ స్టార్ డైరెక్టర్లు గా మారి స్టార్స్ తో సినిమాలు చేస్తుంటే సంపత్ నంది మాత్రం ఇంకా గోపిచంద్ లాంటి సెకండ్ గ్రేడ్ హీరోల దగ్గరే ఆగిపోయారు.

ప్రస్తుతం ఆయన నాగార్జున తో ఒక సినిమా చేయబోతున్నారు అనే టాక్ వచ్చినప్పటికీ అది అఫిషియల్ గా ఇంకా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు అలాగే నాగార్జున ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది ఈ టైం లో సంపత్ నంది కి నాగార్జున ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే వేచి చేసి చూడాల్సిందే.సంపత్ నంది సినిమాలు సరిగ్గా అడకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయన చేసిన సినిమాలు రొటీన్ గా ఉంటాయి అనే టాక్ ను సంపాదంచు కోవడమే మెయిన్ దానికి ముఖ్య కారణం అని చెప్పాలి…ఇక ఇప్పటికైనా ఒక మంచి కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారొ లేదో చూడాలి…

 Even After Making A Movie With Ram Charan, The Director Has Not Scored A Single-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube