తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని తెలిపారు.
ఎక్కువ వేతనాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయామని కేటీఆర్ పేర్కొన్నారు.తాము షాడో టీమ్ ను ఏర్పాటు చేసుకుంటామన్నారు.
నిరుద్యోగ భృతిపై నాలుక మడత వేశారన్నారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలే కాదు.412 హామీలు ఇచ్చిందని తెలిపారు.వారు చెప్పిన విధంగా వంద రోజుల్లో హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని స్పష్టం చేశారు.
అయితే రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తారా? కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టమని తెలిపారు.ఈ నేపథ్యంలో తాము దేనికైనా సిద్ధంగానే ఉన్నామని వెల్లడించారు.