ఆ లిస్టు లోకి చేరిన దీప్తి సునైనా.. దెబ్బకు ఆ పని చేసేసిందిగా?

ఈమధ్య సెలబ్రిటీలు బాగా అడ్వటైజ్మెంట్లు, ఆన్లైన్ గేమ్స్ గురించి బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు.చిన్న ఆర్టిస్టుల నుండి స్టార్ హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ గేమ్స్ గురించి ప్రమోట్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.

 Deepti Sunaina Joined The List, Deepti Sunaina, Bigg Boss, Short Films, Cover So-TeluguStop.com

అయితే వీళ్ళు ఇటువంటి ఆన్లైన్ గేమ్ ల గురించి ప్రమోట్ చేయటం వల్ల వెంటనే వీరిని నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.అంతేకాకుండా మోసాలు చేసే ఆన్లైన్ గేమ్ గురించి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ కామెంట్ ద్వారా తిడుతున్నారు.

అయితే తాజాగా దీప్తి సునైనా కూడా ఆల్ లిస్టులోకి చేరిపోయింది.ఇక వెంటనే తనని ఎవరు తిట్టకూడదు అని ఒక పని కూడా చేసింది.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా గురించి అందరికి పరిచయమే.

వర్డల్ బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

దీంతో బాగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ఇక తొలిసారిగా డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకుంది.ఈమె మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.అలా వీరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.అలా లవ్ గా మారింది.కానీ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మితిమీరి ప్రవర్తించడంతో ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని షాక్ ఇచ్చింది.వీళ్ళ ఫాలోవర్స్ కూడా ఈ విషయాన్ని తట్టుకోలేక పోయారు.

మొత్తానికి ఈమె రిఫ్రెష్ అయ్యింది.ఇక ఈమె చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో తను 365 అనే ఆన్లైన్ గేమ్ గురించి ప్రమోట్ చేసింది.అయితే వీటి ద్వారా నెగటివ్ కామెంట్లు వస్తాయి అని ముందే ఊహించటంతో.దెబ్బకు తన కామెంట్ బాక్స్ ను మ్యూట్ లో పెట్టింది.అంటే తను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నట్లుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube