కొరటాల-చిరు సినిమాకు డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత ఎవరితో సినిమా చేస్తారా అనే ప్రశ్నకు కొరటాల శివ రూపంలో సమాధానం దొరికింది.అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చి రోజులు గడుస్తున్నా సినిమా మాత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు.

 Date Confirmed For Chiranjeevi Koratala Film Shooting-TeluguStop.com

దీంతో మెగా ఫ్యా్న్స్‌ ఆందోళనకు గురయ్యారు.కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ఈనెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ సరికొత్త లుక్‌లో కనిపస్తారట.

ఇక ఈ సినిమాలో కూడా కొరటాల శివ స్టైల్‌లో సోషల్ మెసేజ్‌ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే ప్రశ్నకు త్రిష రూపంలో జవాబు దొరికింది.

గతంలోనూ చిరు-త్రిష కాంబినేషన్‌ స్టాలిన్ చిత్రంలో మెప్పించారు.మరి ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో నటిస్తాడు, ఈ సినిమాకు టైటిల్ ఏమిటి అనే విషయాలపై చిత్ర యూనిట్ ప్రకటన చేయాల్సి ఉంది.

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్స్‌పైకి వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube