డప్పులు ధర్నాలతో రంజుగా తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్, బీజేపీపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడంతో రంజుగా మారాయి.తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొననందుకు నిరసనగా తహశీల్దార్ కార్యాలయాల ముందు రైతులతో కలిసి నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు.

 Dappulu Dharnalato Ranjuga Telangana Politics Bandi Sanjay, Bjp Party-TeluguStop.com

ఇక అందుకు కొనసాగింపుగా బీజేపీ వాళ్ళు డప్పులతో తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసన ప్రదర్శనలు చేపడుతున్న పరిస్థితి ఉంది.అయితే రేపు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలతో ఒక్కసారిగా బీజేపీ వ్యతిరేక చర్చ తెలంగాణలో జరుగుతుందని టీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Telangana-Polit

అయితే ధాన్యం కొనుగోలు విషయంలో ఇరు పార్టీలు రాజకీయం చేస్తున్నాయనే చర్చ క్షేత్ర స్థాయి ప్రజల్లో నడుస్తున్న పరిస్థితి ఉంది అయితే చాలా రోజులుగా కేసీఆర్ బీజేపీ తరహా రాజకీయంపై స్పందించకపోవడంతో దూకుడును పెంచుకుంటూ పోయిన బీజేపీ ఇప్పుడు ఇక కేసీఆర్ రంగంలోకి దిగడంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న పరిస్థితి ఉంది.మరి రేపటి టీఆర్ఎస్ ధర్నాలతో బీజేపీ తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక పార్టీగా ముద్ర పడుతుందా లేక రేపటి ధర్నాల ప్రభావం బీజేపీపై పడకుండా ఏవిధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.మరి టీఆర్ఎస్ ధర్నాల తరువాత కేసీఆర్ విలేఖరుల సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారా లేక ఏవిధమైన నిర్ణయాన్ని తీసుకొనున్నారనే దానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీని వదిలి పెట్టేది లేదని ప్రకటించిన కేసీఆర్ ధర్నాలతోనే తన నిరసనను ఆపేస్తారా లేక ఇంకాస్త ముందుకెళ్ళి ఢిల్లీలో ఏమైనా నిరసన ప్రదర్శన చేపడతారా అనేది రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube