సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు మాయమాటలతో జనాల్ని బురిడీ కొట్టేస్తూ వారి అకౌంట్ లో నుంచి డబ్బులు కాజేస్తున్నారు.కొత్త రకం మోసానికి తెరతీశారు సైబర్ నేరగాళ్లు.
తాజాగా ఓ వ్యక్తి నుండి సైబర్ నేరగాళ్లు 8 లక్షలు దోచేశారు.వివరాల్లోకి వెళితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది ఆమెకు వైద్యం చేయాలనుకుంది కూతురు.
ఈనెల 9న ఆమెకు ఓ ఫోన్ వచ్చింది.నేను విజయ్ కుమార్ ని మాట్లాడుతున్నానని ” కౌన్ బనేగా కరోడ్ పతి” లో 25 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని చెప్పాడు.
సైబర్ నేరగాళ్ల ని ఆమె గ్రహించలేక పోయింది.ప్రాసెసింగ్ ఫీజు కోసం రెండు లక్షలు చెల్లించమని కోరడంతో వారు చెప్పిన ఖాతాకు నగదు పంపింది.
మరొక తేదీన వాట్స్అప్ కాల్ చేసి నేను ” కౌన్ బనేగా కరోడ్ పతి” విచారణ అధికారిని 75 లక్షలు, చెల్లించాలని చెప్పడంతో చెల్లించింది.ఇలా పలుమార్లు ఫోన్ రావడంతో విడతలవారీగా రూ.8,18,000 చెల్లించింది.మళ్లీ ఫోన్ చేసిన ప్రాసెసింగ్ ఫీజు కోసం రెండు లక్షలు చెల్లించమని అడగడంతో మోసం చేస్తున్నారని, తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.