'తగ్గేదే లే' అంటూ పుష్పరాజ్ డైలాగ్‌కు రీల్స్ చేసిన టీమిండియా క్రికెటర్.. ఫ్యాన్స్ ఫిదా!

అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.తగ్గేదే లే అని పుష్పరాజ్ ఈలలు వేయిస్తుంటే.

 Cricketer Ravindra Jadeja Mesmerizing With Pushpa Taggede Le Dialogue Details, P-TeluguStop.com

నా సామి అంటూ శ్రీవల్లి కైపెక్కిస్తోంది.ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మేనియానే నడుస్తోంది.

ముఖ్యంగా తగ్గేదే లే అనే డైలాగ్‌కు చాలామంది రీల్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా తగ్గేదేలా అంటూ పుష్ప మూవీ డైలాగు చెబుతూ అటు టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు.

పుష్ప పార్ట్ 1 సినిమాలో అల్లు అర్జున్ ఒక హైఓల్టేజ్ మాస్ డైలాగ్ చెప్తాడు. ”పుష్ప.

పుష్పరాజ్‌.దీనమ్మ తగ్గేదే లే.” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ వెంట్రుకలు నిక్క పొడిచేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు.అయితే ఈ డైలాగ్‌కు తాజాగా రవీంద్ర జడేజా అదిరిపోయేలా లిప్ సింక్ ఇచ్చాడు.

ఈ వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా రవీంద్ర జడేజా షేర్ చేశాడు.అయితే తెలుగు సినిమాలోని పుష్ప రాజ్ డైలాగ్ కు రవీంద్ర జడేజా యాక్ట్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సూపర్ గా యాక్ట్ చేశారు అంటూ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.కొద్ది రోజుల క్రితం గాయాలపాలైన రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

ఇప్పుడు బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలోనే బన్నీ డైలాగ్ చెప్పి ఫిదా చేశాడు.

తగ్గేదే లే డైలాగు వీడియోలో బన్నీ ఫేస్ మార్ఫింగ్‌ చేసి డేవిడ్‌ వార్నర్‌ కొద్ది రోజుల క్రితం అలరించిన విషయం తెలిసిందే.ఇక సామాన్యులు కూడా ఈ సినిమా డైలాగులను చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాలతో సహా తమిళనాడు, కేరళ ఇలా చాలా రాష్ట్రాల సినిమా ప్రేక్షకులు పుష్ప మూవీని బాగా ఇష్టపడుతున్నారు.యూట్యూబ్ లో ఈ సినిమా పాటలు కూడా ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube