మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.
రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో.
ఈ రోజువిడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది.ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్ వీడియో లో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి.ఆది వేసుకున్న టీషర్టు పై ‘ఎవడి యాంగిల్ వాడిది”అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది.
హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు, లైట్ గడ్డం ఇవన్నీ అది లుక్ ని మరింత స్టయిలీస్ గా చూపించాయి.కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తారాగణం: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ సాంకేతిక విభాగం: సమర్పణ: లక్ష్మీ రాధామోహన్ బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత : కేకే రాధమోహన్ రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి సంగీతం : ఆర్ఆర్ ద్రువన్ డీవోపీ: సతీష్ ముత్యాల ఆర్ట్ : కొలికపోగు రమేష్ ఎడిటర్: సత్య గిడుతూరి యాక్షన్: రామ కృష్ణ కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్ ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్ కుమార్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను) పీఆర్వో: వంశీ-శేఖర్ డిజైనర్ : రమేష్ కొత్తపల్లి