జుట్టును సిల్కీగా మెరిపించే హెయిర్ సీర‌మ్.. ఇంట్లోనే ఇలా చేసుకోండి!

సాధార‌ణంగా చాలా మంది అమ్మాయిలు త‌మ జుట్టు సిల్కీగా మెరిసిపోవాల‌ని కోరుకుంటారు.కానీ, జుట్టు సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను వాడ‌టం, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, పోష‌కాల కొర‌త‌, హెయిర్‌ ఆయిల్స్‌ను ఎవైడ్ చేయ‌డం, రెగ్యుల‌ర్‌గా షాంపూ చేసుకోవ‌డం, హెయిర్ స్టైలింగ్‌ టూల్స్‌ను రోజూ వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు పొడిబారిపోతుంటుంది.

 How To Make Serum For Silky Hair! Serum, Hair Serum, Silky Hair, Hair Care, Hai-TeluguStop.com

దాంతో కేశాలు త‌ర‌చూ చిక్కుబడిపోయి చిందరవందరగా త‌యార‌వుతాయి.

ఇలా మీకు అవుతుందా.? అయితే మీరు ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ హెయిర్ సీర‌మ్ ను వాడాల్సిందే.ఈ సీర‌మ్ ఎలాంటి జుట్టును అయినా సిల్కీగా, షైనీగా మెరిపించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ సీర‌మ్‌ను ఇంట్లోనే సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్‌ ఆయిల్ వేసుకుని రెండు, మూడు నిమిషాల పాటు క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో ఐదు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ ను వేసి విస్క‌ర్ సాయంతో బాగా మిక్స్ చేసుకుంటే న్యాచుర‌ల్ హెయిర్ సీర‌మ్ సిద్ధం అవుతుంది.

Telugu Care, Care Tips, Serum, Homemade Serum, Silky-Telugu Health Tips

ఈ సీర‌మ్‌ను ఏదైనా బాటిల్‌లో నింపుకుంటే.ప‌దిహేను రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ఈ సీర‌మ్‌ను వారంలో మూడు సార్లు జుట్టుకు అప్లై చేసుకోవాలి.

త‌ద్వారా కేశాలు స‌హ‌జంగానే సిల్కీగా మెరుస్తాయి.అంతేకాదు, ఈ న్యాచుర‌ల్ సీర‌మ్‌ను వాడ‌టం వ‌ల్ల హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది.

జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా సైతం పెరుగుతుంది.కాబ‌ట్టి, ఈ సీర‌మ్‌ను త‌ప్ప‌కుండా త‌యారు చేసుకుని యూస్ చేసేందుకు ప్ర‌య‌త్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube