తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై సీపీఎం ఇవాళ మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ విధించింది.తాము అడుగుతున్న సీట్లు ఇవ్వకపోతే పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను సీపీఎం ప్రకటించనుంది.
ఈ మేరకు నిన్న పొత్తులపై రాష్ట్ర కమిటీలో సీపీఎం పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యవహారిస్తున్న తీరుపై సీపీఎం పార్టీ నేత తమ్మినేని వీరభద్రం స్పందించారు.
ఎవరి పంచన చేరే అలవాటు వామపక్షాలకు లేదన్నారు.అయితే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే పొత్తులు పెట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఏ జాబితా చూసి తాము భయపడేది లేదన్న తమ్మినేని తమ జాబితాలను తమకు ఉంటాయని స్పష్టం చేశారు.ఒంటరి పోటీపై నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ నేతల సూచనతో ఇవాళ మధ్యాహ్నం వరకు వేచి చూడనుంది.
కానీ అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోవచ్చని భావిస్తున్న సీపీఎం ఒంటరిగానే బరిలో దిగాలని యోచనలో ఉందని తెలుస్తోంది.