తెలంగాణలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఈ క్రమంలో తొలి ఫలితాన్ని అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు అధికారికంగా వెల్లడైన ఫలితాల ప్రకారం అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు.సుమారు 28 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర రావుపై గెలుపొందారు.
అలాగే ఇల్లందులోనూ హస్తం పార్టీ విజయపతాకం ఎగురవేసేందుకు రెడీగా ఉంది.ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య సుమారు 39 వేల 7 వందల మెజార్టీతో కొనసాగుతున్నారు.
ఈ రిజల్ట్ ను అధికారికంగా ప్రకటించనప్పటికీ కాంగ్రెస్ దే విజయమని స్పష్టం అవుతోంది.