సామాజిక దూరం పాటించండి అంటే ఏకంగా చెట్టు....

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు కరోనా.చిన్న నుంచి పెద్ద వరకు కరోనా పేరు చెప్పగానే పరుగులు పెట్టె పరిస్థితి నెలకొంది.

 Man Enjoys Solo 'picnic' Atop A 60-foot Tree In A Park Because Of Social Distanc-TeluguStop.com

ఎలాంటి ఔషధం లేకపోవడం తో మాస్క్ ధరించడం,మనుషుల మధ్య సామజిక దూరం పాటించాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే కొంతమంది నిపుణుల సూచనలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రవర్తిస్తుంటే,మరికొందరు ఏమో అతిగా పాటించి మరిన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు అనిపిస్తుంది.

అలాంటి ఘటనే ఒకటి బ్రిటన్ లో చోటుచేసుకుంది.మనుషుల మధ్య సామజిక దూరం పాటించాలి అంటే ఒక యువకుడు మాత్రం ఈ కరోనా కు దూరంగా ఉండాలని ఏకంగా చెట్టు ఎక్కి చిటారు కొమ్మన కూర్చున్నాడు.

బ్రిటన్ లోని బాత్ లో ఉన్న రాయల్ విక్టోరియా పార్క్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడం తో నెటిజన్లు తమదైన శైలి లో ట్రోల్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతున్న నేపథ్యంలో బ్రిటన్ లోని ఒక యువకుడు ఏకంగా 60 అడుగుల చెట్టు ఎక్కి, ఆ చెట్టు చిటారు కొమ్మన ప్రశాంతంగా కూర్చొని తనకు నచ్చిన శాండ్ విచ్ తింటున్నాడు.

అయితే పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకోవడం తో పార్క్ కు వచ్చిన వారు అతడ్ని చూసి ఆశ్చర్యపోయారు.అతడు అసలు ఎందుకు చెట్టు ఎక్కి కూర్చున్నాడో వారికి కాసేపు అర్ధం కాలేదు.

అక్కడ నుంచి ఎప్పుడు కిందపడిపోతాడా అన్న టెన్షన్ వారిలో మొదలైంది.ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

అయితే ఈ దృశ్యాలు అన్ని రికార్డ్ అవ్వడం తో ఈ వీడియో సోషల్ మీడియాలో దర్సనం ఇచ్చింది.ఇక అంతే నెటిజన్లు తమదైన శైలి లో కరోనా కు ఇంతకన్నా సోషల్ డిస్టెన్స్ ఇంకేమైనా ఉంటుందా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube