కరోనా విలయతాండవం: వైరస్‌తో నేపాల్‌లో భారతీయ వ్యాపారవేత్త మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది.సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా నేపాల్‌లో ఓ భారతీయ వ్యాపారవేత్త కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు.65 ఏళ్ల సదరు వ్యక్తి నేపాల్‌లోని బిర్గుంజ్‌లో వ్యాపారం నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఆయన డయాబెటిస్, గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ర్యాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ (ఆర్‌డీటీ)లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.అయితే ఆ వృద్ధుడికి నిర్వహించిన పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఫలితం ఇంకా రావాల్సి వుంది.

 Indian Businessman In Nepal Dies Of Covid 19,covid 19, Nepal,indian Businessman-TeluguStop.com

జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం మధ్యాహ్నం నారాయణి ఆసుపత్రిలో ఆయన చేరాడు.

అక్కడి సిబ్బంది పీసీఆర్ పరీక్షకు నమూనాలను తీసుకున్న అనంతరం సదరు వ్యక్తిని కరోనా చికిత్స కోసం పంపించారు.పాజిటివ్‌గా తేలిన తర్వాతి రోజే ఆ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఆయనకు గుండె జబ్బులతో పాటు డయాబెటిస్ ఉండటం వల్ల పరిస్ధితి విషమించినట్లుగా నీరజ్ భావిస్తున్నారు.కాగా నేపాల్‌లో గడిచిన 24 గంటల్లో 130 కొత్త కేసులు నమోదయ్యాయి.

వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 18,613కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.ఇప్పటి వరకు నేపాల్‌లో 45 మంది కరోనాతో మరణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube