తెలంగాణలో కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తుంది.రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి కరోనా కొత్త వేరియంట్ సోకింది.నాంపల్లిలోని ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి కరోనా సోకిందని నిలోఫర్ వైద్యులు నిర్ధారించారు.
అటు దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయింది.జలుబు, తలనొప్పితో పాటు జ్వరం వంటి లక్షణాలతో పలువురు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.