ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ( AI chatbot chatgpt ) అందుబాటులోకి వచ్చాక రైటర్ల జాబ్‌లు చాలా వరకు రిస్క్‌లో పడ్డాయి.చాలామంది కాపీ రైటర్స్, కంటెంట్ రైటర్స్ ఉద్యోగాలను కోల్పోయారు కూడా.
అయితే ఇది చాలదన్నట్టు చాట్‌జీపీటీ రైటర్లు కష్టపడి రాసుకున్న కంటెంట్ దొంగలించిందని ఆరోపణలు వస్తున్నాయి.ఈ ఆరోపణలతో తాజాగా చాట్‌జీపీటీని డెవలప్ చేసిన ఓపెన్ఏఐపై యూఎస్‌లో కేస్ కూడా ఫైల్ అయింది.
చాట్‌జీపీటీకి శిక్షణ ఇచ్చేందుకు తమ అనుమతి లేకుండా తమ పుస్తకాలను ఉపయోగించినందుకు తాజాగా కొందరు ప్రముఖ రైటర్లు ఫైర్ అయ్యారు.ఈ రైటర్ల గ్రూపు ఓపెన్ఏఐపై దావా ఫైల్ చేసింది.ఓపెన్ఏఐ తమ రచనలు దొంగిలించడానికి చాట్‌జీపీటీని ఉపయోగించిందని, దీనివల్ల తమకు జీవనోపాధి కష్టతరం అయిందని రచయితలు ఆందోళన చెందుతున్నారు.వారు డబ్బు డిమాండ్ చేయడంతో పాటు, ఓపెన్ఏఐ వారి పుస్తకాలను ఉపయోగించడం మానేయాలని అడుగుతున్నారు.
ఓపెన్ఏఐ AI సాఫ్ట్‌వేర్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి రచయితల కాపీరైటెడ్ కంటెంట్ ఉపయోగించడం అన్యాయం అన్నట్లు అసహనం వ్యక్తం చేసిన వారిలో జోనాథన్ ఫ్రాంజెన్, జాన్ గ్రిషమ్, జోడి పికౌల్ట్, జార్జ్ సాండర్స్, “గేమ్ ఆఫ్ థ్రోన్స్”( Game of Thrones ) నవలా రచయిత జార్జ్ R.R.మార్టిన్( George R.R.Martin ) కూడా ఉన్నారు.
ఓపెన్ఏఐ పబ్లిక్ డొమైన్లో పుస్తకాలను ఉపయోగించవచ్చని లేదా కాపీరైట్ చేసిన మెటీరియల్‌ని వాడటానికి లైసెన్సింగ్ ఫీజు చెల్లించవచ్చని రచయితలు పేర్కొన్నారు.ఇవేమీ చేయకుండా, ఓపెన్ఏఐ పైరేటెడ్ పుస్తకాల అక్రమ రిపోజిటరీలను ఉపయోగించిందని వారు ఆరోపించారు.దీనివల్ల లో-క్వాలిటీ గల ఇ-పుస్తకాలను రూపొందించడానికి, రచయితలను అనుకరించడానికి, మానవ-రచయిత పుస్తకాలను భర్తీ చేయడానికి చాట్‌జీపీటీ ఉపయోగించబడుతుందని రచయితలు ఆందోళన చెందుతున్నారు.
జనరేటివ్ AI ద్వారా ఎదురయ్యే ఆర్థిక ముప్పుల గురించి కూడా వారు ఆందోళన చెందుతున్నారు, ఇది భవిష్యత్తులో అనేక ఉద్యోగాలను భర్తీ చేయగలదు.