బ్రాహ్మణి తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడలేరా.. ఆమెలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్లు ఇవేనా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నారా బ్రాహ్మణి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.నారా బ్రాహ్మణి( Brahmani Nara ) రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారని ప్రజల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది.

 Brahmani Plus And Minus Points Details Here Goes Viral In Social Media , Brahm-TeluguStop.com

బిజినెస్ ఉమెన్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న బ్రాహ్మణి ప్రజల్లోకి నిజంగానే వస్తారో లేదో తెలియాల్సి ఉంది.అయితే బ్రాహ్మణి తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడలేరని తెలుస్తోంది.

భారతదేశానికి ఐటీని తెచ్చింది చంద్రబాబేనని చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత బ్రాహ్మణి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.ఏ మాత్రం అవగాహన లేకుండా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చి లాభం లేదు.ఎన్టీఆర్( NTR ) మనవరాలిగా, చంద్రబాబు కోడలిగా, ఏ అంశం గురించి అయినా ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడే మహిళగా బ్రాహ్మణికి గుర్తింపు ఉంది.అయితే ప్రజల్లోకి వచ్చి సక్సెస్ కావాలంటే ఇవి మాత్రమే చాలవు.

లోకేశ్( Nara lokesh ) తో కలిసి పాదయాత్ర చేస్తారా అనే ప్రశ్నకు సైతం ఆమె స్పందిస్తూ పాదయాత్ర లోకేశ్ గారి సబ్జెక్ట్ అని పాదయాత్ర గురించి లోకేశ్ చెబుతారని బ్రాహ్మణి అన్నారు.బ్రాహ్మణి పాదయాత్ర చేయడం, ప్రజల్లోకి వచ్చి టీడీపీ స్థాయిని పెంచడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్నికలకు ఆరు నెలల ముందు బ్రాహ్మణితో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.టీడీపీలో ఎంతోమంది అనుభవం ఉన్న సీనియర్ నేతలు ఉన్నారు.చంద్రబాబు విడుదలయ్యే వరకు వాళ్లలో ఎవరో ఒకరు పార్టీ బాధ్యతలను తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.టీడీపీ విషయంలో ప్రయోగాలు చేస్తే మాత్రం పార్టీ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

టీడీపీ సీనియర్ నేతలు సైతం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల విషయంలో పూర్తిస్థాయిలో అసంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.పొలిటికల్ ఎంట్రీ గురించి బ్రాహ్మణి ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube