భానుమతికి ఘంటసాలకు మధ్య ఇంత గొడవ జరిగిందా.. ?

అలనాటి నటి భానుమతి గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 Controversy Between Bhanumathi And Ghantasala,bhanumathi, Ghantasala, Controvers-TeluguStop.com

భరణి పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రాల్లో విప్ర నారాయణ ఒకటి.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు విప్ర నారాయణ పాత్రను, భానుమతి దేవదేవి పాత్రనుపోషించారు.

అయితే భరణి సంస్థ నిర్మించిన లైలా మజ్ను, ప్రేమ, చండిరానీ చిత్రాల్లో ఘంటసాల పాటలే ఉన్నాయి.అక్కినేనికి ఘంటసాల తప్ప ఇక ఎవరు పాడినా బాగోదని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

అయితే చక్రపాణి సినిమాలో నాగేశ్వరరావుకు ఏ.ఎం.రాజాతో పాడించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.అసలు తేరా వెనుక ఏం జరుగుతుంది అనే సందేహాలు అందరికి వచ్చాయి.

ఇక ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది.అసలు ఏం జరిగినంటే.

భానుమతి అద్భుత నటి.బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా.అయితే ఆమెకు మాట దూకుడెక్కువ.ఒక రోజు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో ఘంటసాల పాట పాడుకుంటూ ప్రాక్టీసు చేస్తున్నారు.ఆయన దగ్గరికి వచ్చి విజయా ఆఫీస్‌ కాదు.అక్కడ పడినట్లు భరణి కుదరదు అని చప్పిందంట.

గొంతు మార్చి పాడండి అని అన్నారట.

దీంతో ఘంటసాలకు కోపం వచ్చి మీకు నచ్చిన వాళ్ళతో పాడించుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడంట.

Telugu Bhanumathi, Bharani, Chakrapani, Controversy, Lv Prasad, Ghantasala, Miss

అప్పుడు చక్రపాణి చిత్రంలో ఏ.ఎం.రాజాతో పాటలు పాడించారు భానుమతి.ఇక విప్ర నారాయణ సినిమాలో సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు, ఘంటసాలకు మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఉండేవి.

అయితే మొదట్లో విజయా సంస్థ నిర్మించిన నాలుగు చిత్రాలకు ఘంటసాల సంగీత అందించారు.

అయితే ఐదో సినిమా మిస్సమ్మకు ఆయన పని చేయలేదు.

Telugu Bhanumathi, Bharani, Chakrapani, Controversy, Lv Prasad, Ghantasala, Miss

ఆ చిత్ర దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ మాత్రం సాలూరి రాజేశ్వరరావు కావాలని కోరుకోవడంతో నిర్మాతలు కాదనలేక పోయారు.విప్ర నారాయణ చిత్రానికి కూడా సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకుడు.ఇటు భానుమతి, అటు రాజేశ్వరరావు ఇద్దరూ విప్ర నారాయణ చిత్రంలో ఉండడంతో ఘంటసాల ఆ చిత్రానికి దూరంగా ఉన్నారు.భరణీ సంస్థ ఆ తరువాత 1956లో తీసిన చింతామణి చిత్రంలో ఘంటసాల తన గాత్రాన్ని ఆలపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube