రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా ఈ నెల 21న భువనగిరిలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.
అలాగే ఈ నెల 21న ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) నామినేషన్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( MLA Komatireddy Rajagopal Reddy ) తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలని భువనగిరి నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతారన్నారు.మే నెల మొదటివారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో సభలు జరుగుతాయన్న రాజగోపాల్ రెడ్డి సభలకు పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )హాజరవుతారని వెల్లడించారు.
తమ అభ్యర్థి చామల గెలుపు ఖరారైందన్న ఆయన మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని ధీమా వ్యక్తం చేశారు.కాగా కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.