తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీకానున్నారు.
హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు నివేదిక రూపొందించి పార్టీ అధిష్టానానికి అప్పగించారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానాన్ని ఇవాళ ఖర్గేకు తెలపనున్నారు.
కాగా మధ్యాహ్నం 12 గంటలకు ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది.తెలంగాణ సీఎం ఎవరనేది ఇవాళ వెల్లడిస్తామని ఖర్గే వెల్లడించారు.
హైకమాండ్ తో చర్చలు ముగిసిన తరువాత డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.మరోవైపు పార్టీ హై కమాండ్ తో మాట్లాడేందుకు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమై చర్చించనున్నారు.