తెలంగాణలో ఎమ్మెల్యే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు హైదరాబాద్ కు పయనం కానున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఏజెంట్లతో గాంధీభవన్ నుంచి పార్టీ ముఖ్యనేతలు జూమ్ మీటింగ్ నిర్వహించారు.ఇందులో భాగంగానే అభ్యర్థులు అంతా హైదరాబాద్ కు రావాలని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.ఈ నేపథ్యంలో రాత్రి నుంచి హైదరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల క్యాంపు ఉండే అవకాశం ఉంది.
మరోవైపు రేపు గెలుపు ధృవీకరణ పత్రం ఏజెంట్లకు ఇవ్వాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రధాన అధికారిని కోరింది.మ్యాజిక్ ఫిగర్ కు దరిదాపుల్లో సీట్లు వస్తే ఎమ్మెల్యేలు చేజారకుండా పకడ్బదీ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.