తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) ఘోరంగా ఓటమి పాలైనా.త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారంలోకి రాబోతోందనే సర్వే నివేదికలతో ఆ పార్టీలో ఎంపీ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది.తెలంగాణ లోని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు పార్టీకి చెందిన కీలకమైన నేతలంతా పోటీ పడుతున్నారు.
కొంతమంది ఇప్పటికే టికెట్లను సొంతంగా ప్రకటించేసుకోగా, మరి కొంత మంది అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.నలుగురు సెట్టింగ్ ఎంపీలకు మళ్లీ ఆస్థానాలనే అధిష్టానం ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, 13 స్థానాల్లో నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) పార్టీ నాయకులకు టార్గెట్ విధించారు.అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు ప్రకటన జాప్యం కావడం వంటివి ఫలితాలపై తీవ్రంగా ప్రభావం చూపించిన నేపథ్యంలో, వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బిజెపి అధిష్టానం సిద్ధం అవుతోంది.
ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వెల్లడించారు.దీనికి సంబంధించిన కసరత్తు మరింత ముమ్మరం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ ను ఆయన ఆదేశించినట్లు సమాచారం.
దీంతో ఎంపీ టికెట్ల( BJP MP Tickets ) కోసం పార్టీలో పోటీ తీవ్రంగా నెలకొంది.బిజెపి సిట్టింగ్ ఎంపీ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మినహాయిస్తే మల్కాజ్గిరి తో పాటు, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.
మెదక్ నుంచి తాను పోటీ చేసేందుకు సిద్ధమని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రగునందం రావు( Raghunandan Rao ) ప్రకటించారు.

బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్( Dr.Laxman ) పేరు కూడా పరిశీలనలో ఉంది.అలాగే మహబూబ్ నగర్ సీటు విషయానికి వస్తే.
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,( DK Aruna ) మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బిసి కమిషన్ మాజీ సభ్యుడు టి ఆచారి వంటి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి( Konda Visweswar Reddy ) సిద్ధమవుతున్నారు.
భువనగిరి సీటు తనకే వస్తుందని మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) ఆశలు పెట్టుకున్నారు.అలాగే భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక మహబూబాబాద్ టికెట్ కు తేజ రామచంద్రు నాయక్, హుస్సేన్ నాయక్, దిలీప్ నాయక్ పోటీ పడుతున్నారు.సుధాకర్ రెడ్డి కి అవకాశం దొరుకుతుందా లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ లేదా గళ్ళ సత్యనారాయణ, గరికిపాటి మోహన్ రావు కు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

అలాగే నల్గొండ నుంచి జితేంద్ర పోటీ చేశారు.వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తారా లేక జాతీయ కార్యదర్శి సోగల కుమార్( Sogala Kumar ) పేరు కూడా వినిపిస్తోంది.మల్కాజి గిరి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్( Etela Rajender ) పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు.ఇటీవలే తెలంగాణకు వచ్చిన అమిత్ షా తోను ఆయన ఈ సీటు విషయమే చర్చించినట్లు సమాచారం.
పి మురళీధర్ రావు, పేరాల శేఖర్ రావు, ఎన్ రామచంద్రరావు, కూనా శ్రీశైలం గౌడ్, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, టి.వీరేంద్ర గౌడ్ ,సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి వంటి వారు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.జహీరాబాద్ నుంచి ఏలేటి సురేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

ఈయనతో పాటు డాక్టర్ కె లక్ష్మణ్ ,వీరశైవ లింగాయత్ సమాజ్ కు చెందిన జాతీయ నేత అశోక్ ముస్తాపురే, సోమయ్య స్వామీజీ చీకోటి ప్రవీణ్ వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు.వరంగల్ ఎంపీ టికెట్ ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుండగా.మాజీ డిజిపి కృష్ణ ప్రసాద్ మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.
నాగర్ కర్నూల్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని పేరు వినిపిస్తోంది హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుకూడా తెరపైకి వచ్చింది.