తెలంగాణలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.దీని ద్వారా ఉపాధి కోల్పోయామని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లతో మరి కాసేపటిలో సీఎం రేవంత్ రెడ్డి భేటీకానున్నారు.హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ సమావేశం జరగనుంది.
మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి తమకు గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.దీంతో కుటుంబాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమకు ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.