ఏపీ సీఎం జగన్ పోలవరంకు చేరుకున్నారు.ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి నుంచి పోలవరంకు చేరుకున్న జగన్ ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్ లను సీఎం జగన్ పరిశీలించనున్నారు.అదేవిధంగా స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ప్రాంతాలను కూడా ఆయన సందర్శించనున్నారు.
అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.ఇందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.