ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు సంపాదించడం కోసం దొంగ బాబాలు, పాస్టర్లుగా అవతారం ఎత్తుతూ ప్రజలతో నీచపు పనులు చేయిస్తున్నారు.కాగా తాజాగా ఓ చర్చి పాస్టర్ బోధనలు వినడానికి చర్చికి వచ్చేటువంటి అందమైన మహిళలతో వ్యభిచార పనులు చేయిస్తున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కన్యా కుమారి జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిలో “షైన్ సింగ్” అనే వ్యక్తి పాస్టర్ గా పనిచేస్తూ మత బోధనలు చేస్తున్నాడు.అయితే ఈ చర్చికి ప్రతివారం వందల సంఖ్యలో ప్రజలు తరచూ వస్తుంటారు.
ఈ క్రమంలో పాస్టర్ షైన్ సింగ్ అందమైన మహిళలను, యువతులకు డబ్బు వల వేసి వారిని మెల్లగా వ్యభిచార కూపంలోకి దింపేవాడు.కాగా ఈ మధ్య పాస్టర్ చైన్ సింగ్ ఆగడాలు రోజురోజుకీ ఎక్కువయ్యాయి.
అంతేకాక ఆదివారం రోజున చర్చికి వచ్చే మహిళలు, యువతులు సుందరంగా అలంకరించుకోవడం మరియు ప్రైవేటు శరీర భాగాలు కనబడే విధంగా బట్టలు ధరించడం వంటివి చేయడంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్చిలో ఏం జరుగుతుందనే విషయం పై నిఘా ఉంచారు.
ఈ క్రమంలో తాజాగా పోలీసులు ఉన్నట్లుండి చర్చి పై రైడ్ చేయడంతో చర్చిలో ముగ్గురు మహిళలు విటులతో కలిసి గడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత వారిని విచారించగా చర్చిలో మత బోధనలు చేసే పాస్టర్ తమతో ఈ పాడు పనులు చేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు.దీంతో పాస్టర్ ని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు.