ఆ చిన్నారి పెద్ద మనస్సుకు చిరంజీవి ఫిదా.. ఏమైందంటే..?

సినిమాల ద్వారా మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి నిజ జీవితంలో కూడా కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు.కరోనాతో బాధ పడుతున్న వాళ్ల కష్టాలు తీర్చడం కొరకు నడుం బిగించిన చిరంజీవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు.

 Chiranjeevi Inspired By A Little Girl Why Because,latest Viral News Social Med-TeluguStop.com

డాక్టర్ సిఫార్సు, రోగి వివరాలు అందజేసి ఆక్సిజన్ సిలిండర్లను పొందే అవకాశం ఉంటుంది.

Telugu Anshu Prabhala, Chiranjeevi, Inspired-Movie

చిరంజీవి కొడుకు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటం గమనార్హం.అయితే తాజాగా ఒక చిన్నారి చిరంజీవి హృదయాన్ని కదిలించారు.నిన్న అన్షి ప్రభాల అనే చిన్నారి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కొరకు తను దాచుకున్న మొత్తంతో పాటు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం అయ్యే మొత్తాన్ని ఇవ్వడంతో చిరంజీవి సంతోషించారు.

చిన్న వయస్సులోనే దాతృద్వాన్ని చాటుకున్న అన్షి ప్రభాల గొప్పదనాన్ని చిరంజీవి తెగ పొగిడారు.అన్షి ప్రభాల తన చుట్టూ ఉండే ప్రపంచం బాగుంటేనే నిజమైన సంతోషం అని చెప్పారని ఆ చిన్నారి ప్రేమకు, మనస్సుకు, ఆలోచనకు తాను ముగ్దుడినైపోయానని ఆమె తెలిపారు.

అన్షి ప్రభాల స్పందించిన తీరు తన హృదయాన్ని తాకిందని చిరంజీవి పేర్కొన్నారు.

Telugu Anshu Prabhala, Chiranjeevi, Inspired-Movie

అన్షి ప్రభాల సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.చిన్నారి అన్షూకు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు లవ్యూ డార్లింగ్ అంటూ పేర్కొన్నారు.చిన్నారి కలలు నిజం కావాలని ఆ చిన్నారి సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్షి ప్రభాల గురించి చిరంజీవి చెప్పుకొచ్చారు.

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తరువాత చిరంజీవి రెండు రీమేక్ సినిమాలలో నటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube