ఇది విన్నారా.. కరోనా పేషెంట్స్ కోసం కొత్త రకం టాయిలెట్స్.

ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వారు వాడుతున్న బాత్ రూమ్ ను ఇతరులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సమయాల్లో ఇంట్లో ఒకే బాత్రూమ్ ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అయితే ఇళ్లల్లోనే కాకుండా ఆస్పత్రుల్లో అటాచ్ బాత్రూమ్ లు, సెపరేట్ బాత్రూమ్ లు లేక కరోనా రోగులు ఇబ్బందిపడుతున్నారు.ఇలాంటి సమయంలో ప్రతిక్షా అనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థిని కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా ఒక టాయిలెట్ ను తయారు చేసింది.

ఈ టాయిలెట్ ను వెంటిలేటర్ పై ఉన్న రోగులు కూడా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.సాధారణంగా టాయిలెట్స్ లో చాలా రకాలున్నాయి.

కానీ కరోనా రోగుల కోసం ఇప్పుడు ఈ సరికొత్త టాయిలెట్ ను ప్రతిక్షా తయారు చేసింది.కరోనా బారిన పడిన వారు క్వారెంటైన్ లో ఉండాలి, పదే పదే బయటకు రావొద్దు అలాగే కరోనా బాధితులు ఉపయోగించిన టాయిలెట్ ను ఇతరులు ఉపయోగించొద్దు అలాంటి సమయంలో ఈ ప్రత్యేక టాయిలెట్ ను వారు ఉపయోగించుకోవచ్చు.

Advertisement

అంతేకాకుండా ఈ టాయిలెట్ ను వాడిన తర్వాత దీనిని కరోనా వార్డ్ లోపల కూడా పెట్టుకోవచ్చు.ఈ టాయిలెట్ లో చాలా ప్రత్యేకతలున్నాయి.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన ప్రతిక్షా మాజే అనే విద్యార్థిని కరోనా రోగుల కోసం ఈ వీల్‌ చైర్ సైజ్ టాయిలెట్‌ ను తయారు చేసింది.ఈ టాయిలెట్ సాధారణ టాయిలెట్ల కంటే చిన్నదిగా, సులువుగా వాడుకునేలా ఉంటుంది.ఈ టాయిలెట్‌ను వార్డ్ లోనే ఉంచుకుని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు.

ఈ టాయిలెట్ కు వీల్‌ చైర్‌ కు పట్టేంత స్థలం ఉంటే చాలు.ఈ టాయిలెట్ ను ఒక చోట నుంచి మరో చోటుకు సులువుగా తరలించవచ్చు.

ఈ ప్రత్యేక టాయిలెట్ ను తయారు చేసిన ప్రతిక్షా మాట్లాడుత కరోనా రోగుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి.ఈ టాయిలెట్ ను తయారు చేసినట్లు చెప్పింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తన మామయ్యకు కరోనా సోకినప్పుడు అతను ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్నాడని, అలాంటి సమయంలో ఆసుపత్రిలో టాయిలెట్ ఉపయోగించడానికి ఇబ్బందులు వచ్చాయని అప్పుడే ఓ ప్రత్యేక టాయిలెట్ తయారు చేశానని చెప్పింది.ఈ టాయిలెట్ ను 5 లేకా 6 సార్లు వాడిన తర్వాత ట్యాంక్ క్లీన్ చేయాలని ఆమె తెలిపింది.ఈ టాయిలెట్ ను తయారు చేయడానికి సుమారు రూ.25 వేలు ఖర్చవుతుందని ప్రతిక్షా వివరించింది.

Advertisement

తాజా వార్తలు