ఎట్టకేలకు 'ఛత్రపతి' సినిమా షూట్ పై వచ్చిన క్లారిటీ !

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తూ, ఎన్నో భారీ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు.బెల్లంకొండ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.“అల్లుడు శీను” సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించదు.ఈ సినిమా పర్వాలేదు అనిపించినా సూపర్ హిట్ అయితే అవ్వలేదు.

 Chatrapathi Hindi Remake Latest Update, Chatrapathi Remake, Bellamkonda Srinivas-TeluguStop.com

ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం ఫిట్ గా కండలు తిరిగిన బాడీతో తనను తాను రెడీ చేసుకున్నాడు.తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమాహిందీలో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను హిందీలో వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మొదటిసారి హిందీ లో అడుగు పెట్టబోతున్నాడు.అంతేకాదు వివి వినాయక్ కు కూడా ఇదే మొదటి సినిమా.

ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

Telugu Chatrapathi, Vv Vinayak-Movie

ఈ సినిమాను జులై లో సెట్స్ మీదకు తీసుకువెళ్లా బోతున్నారట.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.షూటింగ్ కోసం హైదరాబాద్ శివారులో భారీ విలేజ్ సెట్ రెడీ చేస్తున్నారట.

అందులోనే షూటింగ్ ప్రారంభించా బోతున్నారని సమాచారం.ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మిగతా షెడ్యూల్స్ బెంగళూరు, ముంబై, బాంగ్లాదేశ్ లలో జరపనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube