చిరు మూవీలో చరణ్‌ పాత్రపై మరో పుకారు

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుంది.ఈ చిత్రానికి చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 Charans Role In The Chiru Film-TeluguStop.com

ఇదే సమయంలో ఈ చిత్రంలో చరణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఆ వార్తలకు బ్రేక్‌ అనేది లేకుండా ఉంది.

ఈ వార్తలను యూనిట్‌ సభ్యులు కొట్టి పారేయక పోవడంతో మీడియాలో వస్తున్న పుకార్లు మరింతగా ముదురుతున్నాయి.

తాజాగా ఈ చిత్రంలో సిద్దార్థ అనే పాత్రలో రామ్‌ చరణ్‌ కనిపించబోతున్నాడు అంటూ కొత్త పుకారు మొదలైంది.

చిరంజీవి ఆచార్య పాత్రను చేస్తుండగా ఆయన శిష్యుడి పాత్రలో చరణ్‌ కొద్ది సమయం కనిపిస్తాడని అంటున్నారు.వీరిద్దరి కాంబోలో అయిదు నుండి పది నిమిషాల పాటు సీన్స్‌ ఉంటాయంటున్నారు.

ఈ చిత్రంలో చరణ్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుందంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Telugu Chiranjeevi, Chiru Ups, Koratala Shiva, Ram Charan-

ఒక వైపు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్న రామ్‌ చరణ్‌ మరో వైపు తండ్రి 152వ చిత్రంలో కూడా గెస్ట్‌ రోల్‌లో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.ఖైదీ నెం.150 చిత్రంలో చరణ్‌ ఒక పాటలో కనిపించాడు.సైరాలో కూడా చరణ్‌ ఉంటాడని ప్రచారం జరిగింది.కాని చరణ్‌ లేకుండానే సైరా వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రంలో సిద్దు పాత్రను చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube