కాకినాడ జిల్లా పిఠాపురంలోని అధికార పార్టీ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారంపై గందరగోళం కొనసాగుతోంది.
కార్యకర్తల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.
పెండెం దొరబాబు ఎన్నికల బరిలో ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే జనసేన నేతలతో ఎమ్మెల్యే దొరబాబు బంధువులు కొందరు టచ్ లోకి వెళ్లారని సమాచారం.
వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దొరబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది.అయితే వైసీపీ లిస్ట్ ప్రకటించిన తరువాత పెండెం దొరబాబు తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు.