ప్రముఖ నటుడు చంద్రమోహన్( Chandramohan ) మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ( health problems )బాధ పడుతున్న చంద్రమోహన్ చివరిసారిగా కె.
విశ్వనాథ్ మరణించిన సమయంలో మీడియా ముందుకు వచ్చారు.చంద్రమోహన్ పెదనాన్న కొడుకు కె.విశ్వనాథ్ అనే సంగతి తెలిసిందే.ఫిబ్రవరి నెల 2వ తేదీన కె.
విశ్వనాథ్( K.Vishwanath ) మృతి చెందారు.విశ్వనాథ్ పార్థివదేహాన్ని చూసిన చంద్రమోహన్ ఆ సమయంలో వెక్కివెక్కి ఏడ్చారు.
విశ్వనాథ్ మరణం చంద్రమోహన్ ను ఎంతగానో బాధపెట్టింది.
ఆ సమయంలో ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందేనని కానీ కె.విశ్వనాథ్ తన లైఫ్ లో ఎన్నో గర్వకారణమైన సినిమాలను అందించారని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.చంద్రమోహన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తొలి సినిమా రంగుల రాట్నంతో మంచి పేరు వచ్చిందని ఆ సినిమాకు నంది అవార్డ్ ( Nandi Award )కూడా వచ్చినా ఆరు నెలల వరకు మరో సినిమా లేదని చంద్రమోహన్ వెల్లడించారు.హీరోగా తప్ప వేరే పాత్రలు చేయవద్దని బి.ఎన్.రెడ్డి( BN Reddy ) సూచించడంతో మొదట్లో చిన్నచిన్న వేషాలు వచ్చినా చేయలేదని చంద్రమోహన్ తెలిపారు.నాగేశ్వరరావు గారితో కలిసి 40 సినిమాలు చేశానని చంద్రమోహన్ అన్నారు.
పదహారేళ్ల వయస్సు సినిమాతో మంచి పేరు వచ్చినా ఆ సినిమా రీమేక్ మూవీ అని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.ఒక సందర్భంలో కమల్( Kamal ) పదహారేళ్ల వయస్సు మూవీ గురించి మాట్లాడుతూ నాకంటే చంద్రమోహన్ బాగా చేశారని కామెంట్ చేశారని ఆయన వెల్లడించారు.చంద్రమోహన్ కు ఆయన నటించిన సినిమాలలో ఆమె, కలికాలం, సగటు మనిషి సంతృప్తిని అందించినట్టు సమాచారం అందుతోంది.రామారావుగారితో ఎక్కువ సినిమాలలో నటించలేదని చంద్రమోహన్ తెలిపారు.అన్నాదమ్ముల అనుబంధం సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి తప్పించడం బాధ పెట్టిందని ఆయన పేర్కొన్నారు.