టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఏపీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
దాదాపు 52 రోజుల తరువాత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు.మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
తమ అధినేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు వెయిట్ చేస్తున్నారు.టీడీపీ శ్రేణులు భారీగా వస్తున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు ఏపీ హైకోర్టు షరతులు విధిస్తూ నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.