చంద్రబాబు కు కేంద్రం ఆహ్వానం .. 'ఢిల్లీ ' పెద్దల మనసు మారుతోందా ?

బిజెపితో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందినప్పటి నుంచి మాత్రమే కాకుండా , ఎన్నికలకు ముందు నుంచి బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు బాబు ప్రయత్నించినా… 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏర్పడిన ఇబ్బందులు, చంద్రబాబు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో,  పరోక్షంగా 2019 ఎన్నికల్లో జగన్ కు వారంతా సహకారం అందించారు.అయితే బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల టిడిపికి పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేకపోయినా, కేంద్రంలో చక్రం తిప్ప వచ్చు , అనేక విషయాల్లో పై చేయి సాధించవచ్చు అనే లెక్కల్లో చంద్రబాబు ఉంటూ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.

 Center's Invitation To Chandrababu Is The Mind Of 'delhi' Leaders Changing Tdp-TeluguStop.com

        అయినా కనీసం బాబుకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు బీజేపీ అగ్ర నేతలు ఎవరూ ఇష్టపడేవారు కాదు.

అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.ఇప్పుడిప్పుడే చంద్రబాబు విషయంలో బిజెపి కేంద్ర పెద్దల మనసు మారుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ మేరకు  చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కమిటీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ” ప్రత్యేక కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.

ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో కల్చరల్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది.భారత్ కు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ల అవుతున్న సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

దీనిలో భాగంగా నిర్వహించే సమావేశంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.
     

Telugu Ap Cm Jagan, Ap, Central, Chandrababu, Jagan, Narendra Modhi, Prime India

  ఉత్సవాల నిర్వహణ జాతీయ కమిటీలో చంద్రబాబును సభ్యుడిగా నియమించారు.ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా చేపట్టేదే అయినా చంద్రబాబు విషయంలో కేంద్ర బిజెపి పెద్దల మనసు మారడం తో టిడిపి నేతల్లో పొత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.ఢిల్లీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

అదే జరిగితే ఏపీలో బిజెపి ,టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అంతే కాకుండా ఏపీలోని రాజకీయ సమీకరణాల్లోనూ స్పష్టమైన మార్పు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube