భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో మంత్రులుగా పలువురు స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అలాగే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.
ఇక గతంలో భారతీయులకు ఉన్నత విద్య అంటే.
ఆస్ట్రేలియా, అమెరికా, యూకేనే.అయితే ఇప్పుడు ఈ విషయంలోనూ కెనడా ముందుకు దూసుకొస్తోంది.
మెరుగైన అవకాశాల నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు కెనడాను కూడా తమ గమ్యస్థానంగా మార్చుకుంటున్నారు.దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వ గణాంకాలు చూస్తే.
ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా విడుదల చేసిన డేటా ప్రకారం 2,26,450 మంది విద్యార్ధులు 2022లో కెనడాకు వచ్చారు.
తద్వారా అంతర్జాతీయ విద్యార్థుల కేటగిరీలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.2022లో కెనడాకు 184 దేశాల నుంచి 5,51,405 మంది అంతర్జాతీయ విద్యార్ధులు వచ్చారు.చైనా (52,165), ఫిలిప్పీన్స్ (23,380) మంది విద్యార్ధులతో మనకంటే వెనుకే వున్నాయి.2021లో 4,44,260 మందికి కెనడాలో చదువుకోవడానికి అనుమతులు వచ్చాయి.ఇది 2019లో (4,00,600) కంటే ఎక్కువ.
ఆ ఏడాది కెనడాకు 6,37,860 మంది అంతర్జాతీయ విద్యార్ధులు వచ్చారు.అయితే కోవిడ్ 19 కారణంగా 2020లో ఈ సంఖ్య తగ్గిపోగా.2021లో 6,17,315కి చేరింది.
అయితే 2022, డిసెంబర్ 31 నాటికి 3,19,130 మంది విద్యార్ధులతో కెనడాలో చదువుతున్న, ఇప్పటికే నివసిస్తున్న విద్యార్ధులతో భారత్ టాప్ 10లో నిలిచింది.ఐఆర్‌సీసీ ప్రకారం.ఇప్పుడు కెనడాలో కేవలం 60 రోజుల వ్యవధిలోనే అధ్యయన అనుమతులు ఇస్తున్నారు.2022లో ఆల్ టైమ్ హై 4.8 మిలియన్ వీసా దరఖాస్తులను కెనడా ప్రాసెస్ చేసింది.నివేదికల ప్రకారం.విదేశీ విద్యార్ధులు కెనడా ఆర్ధిక వ్యవస్థకు ఏడాదికి 15.3 బిలియనలకు పైగా విరాళాలు అందిస్తున్నారు.
.