వ్యవసాయ రంగంలో టెక్నాలజీ రోజు రోజుకు సరికొత్త రూపురేఖలను తీర్చి దిద్దుకుంటునే ఉంది.ఈ క్రమంలోనే రైతులు ఎక్కువగా పాలీ హౌస్ బాట పట్టారు.
ఇందుకు ప్రధాన కారణం ఆరుబయట పండించిన పంటలో.పాలీ హౌస్ లో పండించిన పంటలలో నాణ్యత, దిగుబడిలో చాలా వ్యత్యాసం ఉంది.
పైగా పాలీ హౌస్ లలో పండించిన పంటలకే మార్కెట్లో మంచి డిమాండ్, మంచి రేటు ఉంది.కానీ ఈ పాలీ హౌస్ నిర్మించి పంటలు పండించడం అంటే అంత సులువేం కాదు.
చాలా ఖర్చుతో కూడుకున్న పని.ఇక సన్న కారు, చిన్న కారు రైతులకు ఈ పాలీ హౌస్ నిర్మాణం అసాధ్యం.
అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా తక్కువ ఖర్చుతో కొత్త టెక్నాలజీలు వస్తున్న క్రమంలో కొంతమంది రైతులు విన్నుతంగా ఆలోచించి తక్కువ ఖర్చులో పాలీ హౌస్ నిర్మించి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇక ఐదు, పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలలో అయితే ఈ పద్ధతిలో నిర్మాణం కష్టమే.అదే ఒక ఎకరం, రెండెకరాల భూమి ఉన్న రైతులు ఈ పద్ధతిలో నిర్మిస్తే సగానికి పైగా ఖర్చు ఆదా చేసుకుని నాణ్యమైన పంట పొందవచ్చు.ఇక ఐరన్, స్టీల్ లను ఉపయోగించి పాలీ హౌస్ నిర్మించాలంటే ఖర్చుతో కూడుకున్న పని.కానీ వెదురు బొంగులతో పాలీ హౌస్ ఏర్పాటు చేస్తే చాలా తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు.
వెదురు బొంగులతో పాలీ హౌస్ నిర్మించాలనుకునేవారు.నిటారుగా, లావుగా ఉండే వెదురు కర్రలను తీసుకోవాలి.తరువాత భూమి లోపలకి లోతుగా గుంతలు తీసి అందులో కాంక్రీట్ ప్లాస్టిక్ బాటలు ఏర్పాటు చేసి గుంతలను పూడ్చాలి.
ఇలా చేస్తే గాలులు వీచినప్పుడు వెదురు కర్రలు గట్టిగా ఉండి, వాలిపోకుండా ఉంటాయి.ఇక 250 గజాల్లో నిర్మించిన పాలీ హౌస్ లో ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుందో అంత దిగుబడి పొందవచ్చు.
పైగా 240 స్క్వేర్ మీటర్లు వెడల్పు, పది మీటర్ల ఎత్తులో ఈ పాలీ హౌస్ నిర్మించడం వల్ల కేవలం రెండు లక్షల ఖర్చులోపే మొత్తం పూర్తవుతుంది.ఇక నాణ్యమైన అధిక దిగుబడి మీ సొంతం.