పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సఫీస్ వద్ద మంచి విజయం సాధించింది…ఈ సినిమాని బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేసిన సంగతి మనకు తెలిసిందే.కానీ ఈమె కంటే ముందే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా ని తీసుకుందాం అని అనుకున్నారు ఆవిడకి కథ కూడా చెప్పారు కానీ ఆమె హిందీ సినిమాలతో బాలీవుడ్ లో బిజీ గా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయింది…
ఈ సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా మంచి విజయం సాధించింది.వీళ్లిద్దరి కాంబినేషన్ కి కూడా మంచి పేరు రావడం తో ఇదే కాంబో ని రిపీట్ చేసే ఆలోచన తో హరీష్ శంకర్ ఇలియానాని తీసుకోవడానికి చూసారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు.అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఇద్దరు కలిసి శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుందాం అని ఫిక్స్ అయ్యారు కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ మాత్రం ఆమెది ఐరన్ లెగ్ అని ఇప్పటి వరకు ఆమె చేసిన రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి అని ఆమె చేస్తే ఈ సినిమా ప్లాప్ అవుద్దని పవన్ కళ్యాణ్ తో చెబితే, పవన్ కళ్యాణ్ గణేష్ తో ఇప్పటి వరకు నువ్వెన్ని హిట్స్ ఇచ్చ్చావ్ రా అని అడిగి, వెళ్లి పని చూసుకో హీరోయిన్ విషయం డైరెక్టర్ చూసుకుంటాడు అని చెప్పాడట.దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేసింది ఈ సినిమా తో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది…
అలా ఇలియానా ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని మిస్ చేసుకుంది ఆ సినిమా ఇచ్చిన హిట్ తోనే శృతి హాసన్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగుతుంది…అందుకే ఇండస్ట్రీ లో హిట్స్ అనేవి చాలా ముఖ్యం అని చెప్తారు…