ఇది విన్నారా. ! ఆన్‌లైన్ ద్వారా గర్భం దాల్చిన ఇంగ్లాండ్ మహిళ.. !

దేవుని సృష్టి ఎంత విచిత్రమైనదో మన అందరికి తెలిసిందే.ఒక జీవికి జన్మనివ్వాలంటే అందులో స్త్రీ పాత్ర ఎంత ఉందో, అదే జీవి ఏర్పడాలంటే పురుషుని పాత్ర కూడా అంతే ఉంది అని చెప్పాలి.

 Can You Hear It An English Woman Who Became Pregnant Online, Viral Latest, News-TeluguStop.com

ఈ భూ ప్రపంచంలోకి ఒక బిడ్డ అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా స్త్రీ, పురుషులు ఇద్దరు కూడా ముఖ్యం అనే చెప్పాలి.గతంలో భర్తతో శారీరక సంబంధం ఉంటేనే భార్య గర్భం దాల్చేది.

కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో గర్భం దాల్చాలంటే శారీరక సంబంధంతో పనిలేకుండా కృత్రిమంగా కూడా గర్భం దాల్చి బిడ్డలను కంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ క్రమంలో ఒక మహిళ ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా గర్భం ధరించి ఒక బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది.

అసలు ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.కానీ నిజంగానే ఇంగ్లాండ్ కి చెందిన మహిళ ఆన్‌లైన్ ద్వారా వీర్యదాతను సంప్రదించి, ఆన్‌లైన్ లో కృత్రిమ గర్భధారణ కిట్‌ ను కొనుక్కుని స్వయంగా తానే గర్భం దాల్చి అందరినీ షాక్ కు గురిచేసింది.

ఇంతకీ ఆ మహిళ కథ ఏంటో ఒకసారి చూద్దామా.

ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌ షైర్‌ లో నివాసం ఉంటున్న 33 ఏళ్ల స్టెఫానీ టైలర్ అనే మహిళ గత కొంతకాలంగా భర్తతో ఏవో గొడవల కారణంగా అతని నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తుంది.

అయితే భర్తతో విడిపోయే సమయానికి ఆమెకు ఫ్రాంకీ అనే ఒక ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.ఈ క్రమంలోనే స్టెఫానీ తన కుమారుడికి తోడుగా రెండో సంతానం కావాలని భావించి కృత్రిమ గర్భధారణ ద్వారా రెండవ బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది.

కాగా కృత్రిమ గర్భం ధరించే క్రమంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను, ఫర్టిలిటీ క్లినిక్‌లను ఆమె సంప్రదించగా అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని తెలిసి స్టెఫానీ వెనుకడుగు వేసింది.కానీ ఎలాగయినా బిడ్డను కనాలనే కోరిక మాత్రం స్టెఫానిలో బాగా నాటుకుపోయింది.

ఈ నేపథ్యంలో తానే స్వయంగా కృత్రిమ గర్భధారణ చేసుకోవాలని నిర్ణయించుకుని ఆన్‌లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టింది.యూట్యూబ్‌, ఇంటర్నెట్ ద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతిపై అవగాహనా పెంచుకుంది.

Telugu England, Pregnant, Sperm Donor, Latest-Latest News - Telugu

అలా జస్ట్ ఎ బేబీ అనే యాప్ ద్వారా ఆరోగ్యకరమైన స్పెర్మ్ డోనర్ ను సంప్రదించింది.ఆ తరువాత వీర్యదాత స్టెఫానీ ఇంటికి వచ్చి తన వీర్యాన్ని ఇచ్చి వెళ్లిపోయిన తరువాత ఈబేలో కృత్రిమ గర్భధారణ కిట్‌ను ఆర్డర్ చేసి ఇంటికి రప్పించుకున్నది.ఆ తరువాత యూట్యూబ్‌లో చూసి కృత్రిమ గర్భధారణ ప్రాసెస్ ను తానే స్వయంగా పూర్తి చేసుకుంది.అలా రెండు వారాల తర్వాత తాను గర్భవతి అయింది.గత ఏడాది అక్టోబర్‌లో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఆ చిన్నారికి ఈడెన్‌ అని పేరుపెట్టింది.

ఇంత అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోతే తాను కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వడం కుదరని పన స్టెఫానీ అభిప్రాయపడింది.అందుకే తన కూతురును ఆన్‌లైన్ చిన్నారిగా అభివర్ణించింది స్టెఫానీ.

ఇదిలా ఉండగా స్టెఫానీకి వీర్యాన్ని దానం చేసిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించడానికి అతను ఒప్పుకోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube