మ్యాన్ హోల్, సింక్‌హోల్ ఓపెన్‌గా ఉంచడం వల్ల అందులో మనుషులే కాకుండా జంతువులు కూడా పడి మరణిస్తున్నాయి.వాటిని మూసివేయాల్సిన బాధ్యత తీసిన వారికి ఉంటుంది కానీ అలా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దీని వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.తాజాగా ఒక పెద్ద ఎద్దు సింక్‌హోల్‌లో( Sinkhole ) పడి విలవిల్లాడిపోయింది.
అది తలకిందులుగా పెద్ద సింక్‌హోల్‌లో పడింది.అది కూడా ఎవరు వెళ్ళని ప్రాంతంలోకి వెళ్లి అది అందులో చిక్కుకు పోయింది.
దానివల్ల ఈ ఎద్దు( Bullock ) అందులో పడినట్లు త్వరగా ఎవరూ గుర్తించలేకపోయారు.చివరికి దీని కథ సుఖాంతం అయింది.
వివరాల్లోకి వెళితే.యూకేలోని( UK ) డర్హామ్‌లోని హాలిడే పార్క్ వద్ద ఉన్న సింక్‌హోల్‌లో ఈ ఎద్దు పడింది.దానిని రక్షించడానికి ముగ్గురు వ్యక్తులు సింక్‌హోల్ వద్దకు చేరుకున్నారు.అంచున నిలబడి ఆవు వెనుక కాళ్లకు బ్లూ కలర్ తాడు కట్టారు.అనంతరం హాలిడే పార్క్( Holiday Park ) సిబ్బంది సమీపంలోని రైతు కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.వించ్ అని పిలిచే ప్రత్యేక యంత్రంతో ఎద్దు కాళ్లకు కట్టిన తాడును పైకి లాగారు.
రంధ్రాల నుంచి వస్తువులను బయటకు తీయడానికి వించ్ ఉపయోగించబడుతుంది.అయితే ఆవును ఆ పరికరంతో బయటికి తీసేటప్పుడు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తీశారు.
ఆపై నేలపై నెమ్మదిగా పడుకోబెట్టారు.అందువల్ల దానికి ఎలాంటి గాయాలు కాలేదు.
అది బయటకు వచ్చాక తన తోటి ఆవులతో కలిసి హాయిగా వెళ్లిపోయింది.అనంతరం మేతమేస్తూ ఆరోగ్యంగా తయారయ్యింది.
విట్టన్ కాజిల్ కంట్రీ పార్క్( Witton Castle Country Park ) వారి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో ఫుటేజ్ జంతువును గుంత నుంచి బయటకు లాగిన దృశ్యం కనిపించింది.“విట్టన్ కాజిల్ సిబ్బంది స్థానిక రైతుతో కలిసి రక్షించడానికి వచ్చింది.ఎద్దు ఎవరూ వెళ్ళని ప్రాంతంలో ఉన్న సింక్‌హోల్‌లో ప్రమాదవశాత్తు జారి పడిపోయింది.” అని విట్టన్ కాజిల్ కంట్రీ పార్క్ వారి ఫేస్‌బుక్ పేజీలో రెస్క్యూ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ రాశారు.దీనిని మీరు కూడా చూసేయండి.