రామ్( Ram Pothineni ) బోయపాటి శ్రీను కాంబినేషన్ లో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న స్కంద మూవీ రిలీజ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.గురువారం రోజున థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ వల్ల ఊహించని స్థాయిలో బెనిఫిట్ పొందనుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్, శ్రీలీల కనిపిస్తున్నా బోయపాటి శ్రీను కనిపించడం లేదు.ఇందుకు కారణమేంటనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గతంలో సైతం సినిమా రిలీజ్ కు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని అయినప్పటికీ ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందించాయని తెలుస్తోంది.స్కంద విషయంలో సైతం బోయపాటి శ్రీను ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది.ఈ సెంటిమెంట్ ప్రకారం స్కంద మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డులను తిరగరాస్తుందేమో చూడాల్సి ఉంది.
స్కంద మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. శ్రీనివాస్ చిట్టూరి ( Srinivasaa Chitturi )ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు.స్కంద సినిమాకు పోటీగా చాలా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయి.
ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.స్కంద మూవీ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. స్కంద మూవీ సక్సెస్ సాధించడంతో పాటు రామ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.స్టార్ హీరో రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.