Rashmika Sraddha Kapoor: రష్మికను చూసి ముఖం తిప్పుకున్న ప్రభాస్ హీరోయిన్.. ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?

స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన( Rashmika ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Bollywood Star Heroine Sradhha Kapoor Ignoring Rashmika-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది.అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక.

ఇకపోతే ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమాలో నటిస్తోంది.అలాగే టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో( Pushpa 2 ) నటిస్తోంది.

తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తాను చాటుతోంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా వెలుగొందుతుంది.

ఇక రష్మిక ఎక్కడ ఉంటే అక్కడ అటెన్షన్ ఉంటుంది.స్టార్ హీరోయిన్లను కూడా పక్కనపెట్టి ఫోటోగ్రాఫర్లు రష్మిక మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు.

కానీ తాజాగా మాత్రం రష్మికను చూసి ఒక బాలీవుడ్ భామ ముఖం తిప్పుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు శ్రద్ధా కపూర్.

( Sraddha Kapoor ) సాహో సినిమాతో( Sahoo Movie ) తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్దా కపూర్.తెలుగులో మొదటి సినిమానే ప్రభాస్ సరసన నటించిన అవకాశం అందుకోవడంతో ఈ భామకు తెలుగులో తిరుగులేదు అనుకున్నారు.

కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయేసరికి ముద్దుగుమ్మ మరోసారి తెలుగు వైపు చూసింది లేదు.

Telugu Ambani, Bollywood, Pushpa, Rashmika, Sraddha Kapoor, Sraddhakapoor, Sradh

ఇక తాజాగా అంబానీ కుటుంబం( Ambani Family ) వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల అందరికీ అంబానీ కుటుంబం ఆహ్వానం పంపింది.అందులో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఉండడం విశేషం.

ఇక ఆ ఈవెంట్లో రష్మిక చక్కగా చీరకట్టులో మెరిసి అందరి చూపులను తన వైపు తిప్పుకుంది.ఆమె ఈవెంట్లో అడుగుపెట్టగానే కెమెరాలు పట్టుకొని ఫోటోగ్రాఫర్లు రష్మికాజీ, రష్మికాజీ అంటూ ఆమెను ఫోటోలు తీస్తూ కనబడ్డారు.

Telugu Ambani, Bollywood, Pushpa, Rashmika, Sraddha Kapoor, Sraddhakapoor, Sradh

ఇక అదే సమయంలో తెలుపు రంగు చుడిదార్ వేసుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని శ్రద్ధ కపూర్ అటు నుంచి వచ్చింది.ఇక శ్రద్ధ రావడాన్ని గమనించిన రష్మిక ఆమెను పలకరించడానికి ఒక సెకండ్ ఆగింది.అయితే శ్రద్ధ మాత్రం రష్మికను ఏమాత్రం పట్టించుకోకుండా ముఖం తిప్పుకొని పక్కనుంచి వెళ్ళిపోయింది.అది చూసి మొదటి రష్మిక కూడా షాక్ అయింది.కానీ, చుట్టూ కెమెరాలు ఉండడంతో ఆమె మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి ఫోటోలపై ఫోకస్ పెట్టింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

శ్రద్ధ కావాలనే రష్మికను అవైడ్ చేసిందా? లేదా ఆమెకు ఫోటోగ్రాఫర్లు ఇస్తున్న అటెన్షన్ చూసి జెలసీ ఫీల్ అయిందా ? లేక రష్మిక రేంజ్ ను చూసి భయపడిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube