కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లో ఊహించని రీతిలో మార్పులు వచ్చేసాయ్.ఒకప్పుడు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఎప్పుడెప్పుడు విడుదల చేయాలా అని ఆసక్తిగా ఎదురు చూసే వారు.
కానీ ఇప్పుడు మాత్రం సినిమాలను విడుదల చేయడమే దర్శక నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.మొన్నటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి.
కానీ ఇప్పుడు వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి.కానీ బాలీవుడ్లో మాత్రం రిలీజ్ విషయంలో స్టార్ లకు తిప్పలు తప్పడం లేదు అన్నది తెలుస్తుంది.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
ఇక ముందు చెప్పిన ప్రకారం ఈ సినిమా లాస్ట్ మంత్ విడుదల కావాల్సి ఉంది.కానీ ఇక సినిమా విడుదల తేదీని మారుస్తూ మార్చి 18 డేట్ ఫిక్స్ చేశారు.
ఇక అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ పృధ్విరాజ్ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ఇక ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.
విడుదల పోస్ట్ ఫోన్ చేస్తూ జూన్ 10కి మార్చేశారు.
ఇక టాలీవుడ్ లో నాని నటించిన జెర్సీ మూవీ అదే టైటిల్ తో బాలీవుడ్ లో తెరకెక్కింది.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి.ముందు అనుకున్న ప్రకారం డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కానీ పాండమిక్ టైం లో కలెక్షన్స్ లో కోత పడుతుంది అని భావించి చివరికి పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం మరో రిలీజ్ డేట్ ప్రకటించింది.
ఇక రణబీర్ కపూర్ హీరోగా పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం షాంషేరా.ఇక ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కానీ రిలీజ్ డేట్ మరోసారి రీషెడ్యూల్ చేసింది చిత్రంబృందం.ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 18న సినిమా విడుదల చేస్తాం అంటూ ప్రకటించింది.కానీ ఇప్పుడు మాత్రం మార్పులు చేస్తూ జూలై 22 ఈ విడుదల తేదీని మార్చేసింది.షారుక్ ఖాన్ పఠాన్ మూవీ కూడా ఏడాది చివర్లో వస్తుంది అని అనుకున్నప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.