బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాజవంశస్తురాలు అని మీకు తెలుసా?

హీరోయిన్ ఎలా ఉండాలి? అందంగా ఉండాలి.చక్కటి అభినయం ప్రదర్శించాలి.

 Bollywood Fire Brand Kanagana Wherabouts , Bollywood, Kanagana, Himachal Prades-TeluguStop.com

సున్నితమైన మనస్సు ఉండాలి.ఇంకా బోలెడు ముచ్చట్లు చెప్తాం.

వీటన్నింటికి కాస్త డిఫరెంట్ మనం చెప్పుకోబోయే హీరోయిన్.తను మరెవరో కాదు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.అందం, అభినయానికి తోడు తనకు కావాల్సినంత పొగరు ఉంటుంది.తాను అందరు హీరోయిన్లలా కాదు.ఏమైనా అంటే తుడుచుకుని వెళ్లడానికి.సవాల్ కు ప్రతిసవాల్ విసురుతానంటుంది.అంతేకాదు.

రాజకీయాల గురించి తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపిస్తుంది.ఘాటైన రాజకీయ విమర్శలతో నిత్యం వార్తల్లో ఉంటుంది.

ఇంతకీ తను ఎక్కడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చింది? తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కంగానాది రాజవంశం.

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాజపుత్ర రాణావత్ వంశంలో తను జన్మించింది.ఆమె ముత్తాత సర్జూసింగ్ రాణావత్ ఎమ్మెల్యే.1951లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించాడు.తన తాత బ్రహం చంద్ రాణావత్ ఐఏఎస్ అధికారి.

తన తండ్రి అమరదీప్ బిజినెస్ మ్యాన్.కంగనా తరతరాలు ధనవంతులే.

అయితే తనకు మాత్రం సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది.ఇంట్లో ఒప్పుకోకపోయినా.

తను సినిమాల్లోకి వచ్చింది.ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బయటకు వచ్చింది.

చేతిలో రూపాయి లేకుండా ముంబైలో అడుగు పెట్టింది.ఆ తర్వాత మోడలింగ్ చేసింది.

కొన్ని నాటకాలు కూడా వేసింది.ఆ తర్వాత మహేష్ భట్ గ్యాంగ్ స్టర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.కంగనా స్టార్ హీరోయిన్ అయ్యింది.

అయితే తను హీరోయిన్ అయ్యింది అని తెలియగానే తన కుటుంబం నుంచి కొన్ని ఒత్తిళ్లు వచ్చాయి.తమ వంశం పేరు రాణావత్ వాడుకోవద్దని ఖరాకండిగా చెప్పారు.

కానీ తను పట్టించుకోలేదు.

Telugu Amardeep, Bollywood, Kanagan, Kanagana, Rajput Ranawat, Ranawat-Telugu St

తాజాగా ఆమె భారత స్వాతంత్య్రం పై సీరియస్ కామెంట్ చేసింది.1947లో వచ్చింది కేవలం భిక్ష అని చెప్పింది.2014లోనే మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చిందని వెల్లడించింది.ఈ వ్యాఖ్యలతో తనపై పలు కేసులు నమోదు అయ్యాయి.అటు భారత్ లో శక్తివంతమైన మహిళ అనే ట్యాగ్ లైన్ తో ఆమె మీద చర్చలు జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube