బీజేపీ " ఆకర్ష్ ".. ఆ ముగ్గురిదే కీ రోల్ !

అధికారం కోసం ఎంతటి సంచలన వ్యూహాలనైనా అమలు చేయడం బీజేపీకీ అందె వేసిన చెయ్.ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకొని అధికారానికి బాటలు వేసుకుంటారు కాషాయ పెద్దలు.

 Bjp's akarsh.. Those Three Are The Key Role, Bjp , Akarsh , Ts Politics , Congre-TeluguStop.com

ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అధికార బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు.కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణ బీజేపీ కొంత స్లో అయినట్లు కనిపిస్తున్నా.

పార్టీకీ బలాన్ని చేకూర్చే వ్యూహాల విషయమై బీజేపీ పెద్దలు కసరత్తులు చేస్తున్నట్లు ఇట్టే అర్థమైపోతుంది.ముఖ్యంగా బీజేపీ( BJP ) ముందున్న ప్రధాన టార్గెట్స్ లలో అధికార బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టడం ఒకటైతే.

బీజేపీకీ పోటీనిచ్చే కాంగ్రెస్ ను వెనక్కి నెట్టడం కూడా మరో టాస్క్.అందువల్ల వీటిపైనే అధిష్టానం ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Akarsh, Cm Kcr, Congress, Dk Aruna, Etela Rajender, Telangana Bjp, Telang

అందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా అమలు చేయాలని బావిస్తోంది.గత కొన్నాళ్లుగా బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెబుతున్నప్పటికి ఆశించిన స్థాయిలో చేరికలు జరగలేదు.పైగా ఇన్నాళ్ళు కేవలం అసంతృప్త నేతలకు మాత్రమే గాలం వేసేందుకు ప్రయత్నించి సరైన ఫలితాలు సాధించలేదు.కానీ ఇప్పుడు గెలుపు గుర్రాలే లక్ష్యంగా ఆపరేష్ ఆకర్ష్ అమలు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ మద్య నే బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు డీకే అరుణ( D K Aruna ) లాంటి వారికి కాంగ్రెస్ లోని అనువణువును అంచనా వేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు.

Telugu Akarsh, Cm Kcr, Congress, Dk Aruna, Etela Rajender, Telangana Bjp, Telang

గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా కొనసాగిన వీరికి ఇప్పటికీ కాంగ్రెస్ లోని చాలమంది నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు.దాంతో వీరి ద్వారా కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలతో పాటు గెలుపు గుర్రాలను కూడా ఆకర్షించాలని కమలం హైకమాండ్ భావిస్తోందట.ఇక అటు బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా కొనసాగుతున్న ఈటెల రాజేందర్( Etela Rajender ) కు బి‌ఆర్‌ఎస్ లోని నేతలను ఆకర్షించే బాధ్యతను భుజాన వేసింది అధిస్థానం.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బి‌ఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలను దెబ్బ తీసే బాద్యతను ఈటెల రాజేందర్ మరియు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ వంటివారినే నమ్ముకుంది అధిష్టానం.మరి ఈ ముగ్గురి ద్వారా బీజేపీలో ఎంతమేర చేరికలు జరుగుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube