పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ రంగం సిద్ధం చేస్తుంది.ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఈనెల 28వ తేదీన కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.
ఈ క్రమంలో తెలంగాణకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై ఆయన నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది.
అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలను అమిత్ షా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.