విజయవాడ: ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.ఈ పరిస్థితుల వల్లే పెట్టుబడులు రాక యువతకు ఉపాధి లభించడం లేదని విమర్శించారు.
విజయవాడలోని భాజపా కార్యాలయంలో పార్టీ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం నిర్వహించారు.ఆ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పురందేశ్వరి మాట్లాడారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధాకరమన్నారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.
ఏపీలో భాజపాను ప్రజలు ఆశీర్వదించాలని పురందేశ్వరి కోరారు.రాష్ట్రానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
జనసేనతో పొత్తు యథావిధిగా కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు.రెండు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా?వద్దా? అనేది భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు.